రెడ్ బుక్ ఎఫెక్ట్: లోకేశ్‌ను అరెస్ట్ చేసేందుకు ఆదేశాలివ్వండి..కోర్టులో సీఐడీ పిటిషన్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు బిగ్ షాక్ తగిలింది.

Update: 2023-12-22 10:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు బిగ్ షాక్ తగిలింది.నారా లోకేశ్‌ను అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. విశాఖ సభలో లోకేశ్ వ్యాఖ్యలు అధికారులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉన్నాయని ఆ పిటిషన్‌లో సీఐడీ పేర్కొంది. తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారుల పేర్లు రెడ్ డైరిలో రాసుకున్నామని లోకేశ్ పదేపదే వ్యాఖ్యలు చేశారని.. ఇది బెదిరింపు ధోరణికి నిదర్శనమని చెప్పుకొచ్చారు. లోకేశ్‌ను అరెస్ట్ చేసేందుకు తమకు అనుమతిని ఇవ్వాలని కోరారు. రెడ్ బుక్‌లో మీ పేర్లు రాశానని చెప్తూ.... పోలీసు విచారణ అధికారులను లోకేశ్ బెదిరిస్తున్నారని పిటషన్‌లో సీఐడీ ఆరోపించింది.టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కేసుల్లో ఉన్న దర్యాప్తు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని.... జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని సీఐడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. సీఐడీ వాదనలు విన్న న్యాయమూర్తి దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయా? అని న్యాయవాదిని ప్రశ్నించింది. దీంతో సీఐడీ తరఫు న్యాయవాది పేపర్ కటింగ్‌లను కోర్టుకు అందజేశారు. ఐఆర్ఆర్ కేసులో 41ఏ కింద లోకేశ్‌కు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నట్లు తెలియజేశారు. కోర్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు లోకేశ్‌ను అరెస్ట్ చేసేందుకు అనుమతిని ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. రెడ్ బుక్ పేరుతో చేస్తున్న హెచ్చరికలను చాలా తీవ్రంగా పరిగణించాలని విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని కోరారు. 

Tags:    

Similar News