మీరు ఊరుకోండిరా అయ్యా.. అసలే వైసీపీ శవంకోసం వెయిట్ చేస్తోంది.. వీడియో వైరల్

జనసేన మాజీ నేత పోతిన మహేష్ వైసీపీ గూటికి చేరారు.

Update: 2024-04-10 09:56 GMT

దిశ వెబ్ డెస్క్: జనసేన మాజీ నేత పోతిన మహేష్ వైసీపీ గూటికి చేరారు. ఈ రోజు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా రెండు రోజుల క్రితం పోతిన మహేష్ జనసేన కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

గతంలో జనసేనను వీడి వేరే పార్టీ జెండాను తాను పట్టుకుంటే విజయనగరం జిల్లాలో ఏ కార్యకర్త అయినా కొబ్బరిబోండాల కత్తితో తన చెయ్యి తీసేయొచ్చని బహిరంగంగా పేర్కొన్నారు.ఇదే మాటను పవన్ కళ్యాణ్ కి చెప్పండి అని ధీమా వ్యక్తం చేశారు.

కాగా ఆయన వైసీపీ గూటికి చేరడంతో గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనితో ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. కొబ్బరిబోండాల కత్తి తీసుకురమ్మంటారా అని మహేష్ పై ట్రోల్స్ జల్లు కురిపిస్తున్నారు. కాగా ఈ అంశంపై జనసేన మహిళా కార్యకర్త రాయపాటి అరుణ స్పందించారు.

సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన కొబ్బరిబోండాల కత్తి తీసుకురమ్మంటారా అని మారుమోగుతోంది.. మీరు గమ్మునుంన్నండిరా అయ్యా.. అసలే వైసీపీ ఎవరి శవం దొరుకుతుందా అని ఎదురు చూస్తోంది అని ఎద్దేవ చేశారు. ఇప్పుడు ఈ ట్రోల్స్ చూస్తే అతన్ని వేసేసి ఆ హత్యని మన ఖాతాలోకి వేస్తారు ఎందుకొచ్చిన గోల అని అరుణ అన్నారు.

2014లో తండ్రి శవం 2019లో బాబాయ్ శవంలా ప్రస్తుతం ఎవరి శవం దొరుకుతుందా అని వైసీపీ వెయిట్ చేస్తోందని.. పెన్షన్ ఆపి అవ్వాతాతల శవాలతో రాజకీయం చెయ్యాలని చూసినా వర్కౌట్ కాలేదని ఎద్దేవ చేశారు. ఇలాంటి సమయంలో చేతబడి చేసేవాడికి నల్లకోడి ఎదురెళ్ళినట్లు ఇతను వైసీపీలోకి వెళ్లారని పేర్కొన్నారు.

2019లో బాబాయ్ ని బాత్ రూమ్ లో గొడ్డలితో వేసేసి ఆ మర్డర్ ను టీడీపీ ఖాతాలో వేసినట్టు, ఇప్పుడు ఇతన్ని వేసేసి జనసేన ఖాతాలోకి వేస్తారని.. ఎందుకు లేనిపోని గొడవ అని కార్యకర్తలకు సూచించారు. ఇలాంటి కోవర్టులు పార్టీని వీడిపోయి పార్టీ ప్రక్షాళన కావాలని కోరుకోవాలని, ఇక ఈ డిస్కషన్ ఇంతటితో వదిలేయండి అని ట్విట్టర్ వేదికగా ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఎక్కడ చూసిన కొబ్బరిబోండాల కత్తి తెమ్మంటారా అని అంటున్నారు.. ఆ కత్తి మనం తేవాల్సిన అవసరం లేదని, వాడు వెళ్ళిందే కత్తుల మధ్యలోకి అని పేర్కొన్నారు. ఏదో ఒక కత్తి వేసేస్తుంది, దాన్ని మన అకౌంట్ లోకి వేసేస్తారు అని ఎద్దేవ చేశారు. లేనిపోని జాతర మనకెందుకు ప్రశాంతంగా పార్టీ కోసం పని చేద్దామని పేర్కొన్నారు.

Tags:    

Similar News