జనసేన మీటింగ్‌లో రాపాక ప్రత్యక్షం.. పార్టీ కేడర్‌లో గుసగుసలు!

జనసేన సమావేశంలో రాపాక వరప్రసాదరావు ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-10-13 08:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: జనసేన సమావేశంలో రాపాక వరప్రసాదరావు ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మకిలిపురంలో ఈ రోజు (ఆదివారం) జరిగిన జనసేన పార్టీ కార్యక్రమానికి రాపాక హాజరవడంతో అక్కడంతా షాక్ అయ్యారు. అయితే రాపాక మాత్రం సైలెంట్‌గా రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్‌ను కలిసి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇక 2019లో జనసేన తరపున గెలిచిన రాపాక.. ఆ తర్వాత నెమ్మదిగా వైసీపీకి దగ్గరయ్యారు. అసెంబ్లీలో జనసేన తరపున ఉన్న ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు ఉన్నా.. ఎప్పుడూ వైసీపీకి సపోర్ట్‌గా మాట్టాడేవారు. ఆ తర్వాతి కాలంలో పూర్తిగా జనసేనను వదిలిపెట్టి వైసీపీలోకి వెళ్లిపోయారు. ఆ ఊపులోనే 2024లో అమలాపురం వైసీపీ ఎంపీగా పోటీ చేసినా.. దారుణంగా ఓడిపోయారు.

ఈ నేపథ్యంలో వైసీపీలో ఆయనకు ఏ మాత్రం గుర్తింపు లభించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు జనసేనలోకి రావాలని, కూటమి నేతలకు దగ్గరవ్వాలని,రాపాక ప్రయత్నాలు సాగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒకవేళ రాపాక తిరిగి జనసేనలోకి రావాలన్నా.. లేదా కూటమిలో భాగం కావాలన్నా అది జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. మరి ఈ విషయంలో మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి.


Similar News