బాబు వద్ద పవన్ కల్యాణ్ కోట్ల రూపాయలు తీసుకున్నాడు: రామ్‌సుధీర్ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ-జనసేన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ-జనసేన కూటమి 118 మందితో ఉమ్మడి జాబితాను విడుదల చేసింది.

Update: 2024-02-26 07:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ-జనసేన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ-జనసేన కూటమి 118 మందితో ఉమ్మడి జాబితాను విడుదల చేసింది. ఇందులో టీడీపీకి 94, జనసేనకు 24 సీట్లు కేటాయించారు. పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించడం హాట్ టాపిక్‌గా మారింది. 175 సీట్లలో కేవలం 24 సీట్లు మాత్రమే తీసుకోవడం ఏంటని.. పవన్ ఏ ప్రతిపాదికన 24 సీట్లకు అంగీకరించాడని చర్చ జరుగుతోంది. కేవలం 24 సీట్లు తీసుకునేందుకు ఒప్పుకోవడంతో జనసేన నేతలతో పాటు, కార్యకర్తలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పవన్ నిర్ణయాన్ని పలువురు జనసేన నేతలే బహిరంగంగా తప్పుబడుతున్నారు.

ఈ క్రమంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై కాపు ఉద్యమ జేఏసీ నేత రామ్‌సుధీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర పవన్ కల్యాణ్ కోట్ల రూపాయలు తీసుకుని.. కాపులను మోసం చేశాడని ఆరోపించారు. 2019 తర్వాత పవన్ కల్యాణ్ ప్రైవేట్ ఫ్లైట్ కొన్నారు, ఆయనకు అన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేష్ కలిసి టీడీపీ, జనసేన టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. జనసేన పేరుతో సభలు పెట్టి.. రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు తలొగ్గి కాపులను పవన్ కల్యాణ్ మోసం చేశాడని ఫైర్ అయ్యారు.

Read More..

దేశంలో ఏ లీడర్ నాలా అధినేత కోసం రక్తాభిషేకం చేయలే: బుద్దా వెంకన్న 

Tags:    

Similar News