Rain Alert:రాష్ట్ర ప్రజలకు రెయిన్ అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇటీవల రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురిసిన సంగతి తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇటీవల రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ఏపీ ప్రజలకు వాతావరణ అధికారులు రెయిన్ అలర్ట్(Rain Alert) జారీ చేశారు. అయితే.. బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినప్పటికీ రేపు(గురువారం) కొన్ని చోట్ల భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల(నవంబర్) 15, 16 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. ఈ నేపథ్యంలో రేపు కృష్ణ, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, ఏటీపీ, సత్యసాయి, టీపీటీవై జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.