అమరావతిలో బీజేపీ సభ.. మాజీ సీఎం జగన్పై పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు
బీజేపీ ప్రజా ప్రతినిధుల సభలో మాజీ సీఎం జగన్పై పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు..
దిశ, వెబ్ డెస్క్: రాజధాని లేని రాష్ట్రంగా ఒకప్పుడు చెప్పుకుంటే ఇప్పుడు ప్రతిపక్షం లేని రాష్ట్రంగా చెప్పుకుంటున్నామని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సెటైర్లు వేశారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను పార్టీ తరపున ఆమె సత్కరించారు. కేందమంత్రి శ్రీనివాసవర్మను సన్మానించారు. అమరావతిలో బీజేపీ ప్రజా ప్రతినిధుల అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ కూటమి విజయం ప్రతి ఒక్కరిదని చెప్పారు. మూడు పార్టీ విధానం, పని తీరు వేరుగా ఉన్నా కార్యకర్తలు సమన్వయంతో పని చేశారని తెలిపారు. అందువల్లే కూటమికి విజయం దక్కిందన్నారు. గత ఐదేళ్లుగా చేసిన అరాచకాలపై ప్రజలు విరుచుకుపడ్డారని, తద్వారా వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. సబ్ కా సౌత్, సబ్ కా వికాస్ తన నినాదమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పష్టం చేశారు.