వైసీపీ నేత బీజేపీలో చేరుతారనే ప్రచారం..స్పందించిన పురందీశ్వరి!

ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Update: 2024-08-29 10:44 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ సారి ఎన్నికల్లో వైసీపీ ఊహించని విధంగా ఓటమిని చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోద కూడా దక్కలేదు. దీంతో పలువురు పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. ఇప్పటికే పార్టీ నుంచి పలువురు నేతలు రాజీనామా చేసి అధికార పార్టీలో చేరారు. ఈ క్రమంలో వైసీపీ నేత గంగిరెడ్డి బీజేపీలో చేరుతారనే వార్తలపై ఆ పార్టీ రాష్ట్రాధ్యాక్షురాలు పురందీశ్వరి స్పందించారు. తాజాగా గుంటూరు వచ్చిన ఆమె ‘చేర్చుకుంటున్నామని మేం చెప్పామా? ఎవరైనా పార్టీలో చేరేందుకు సిద్ధమైనప్పుడు జిల్లా నేతలు చర్చించుకొని రాష్ట్ర నాయకత్వానికి ప్రతిపాదన పంపుతారు. వాటిని మేం అధిష్ఠానానికి పంపుతామని అన్నారు. పార్టీ సిద్ధాంతానికి, క్రమశిక్షణకు కట్టుబడి పనిచేసే వారినే తీసుకుంటాం అని ఆమె స్పష్టం చేశారు.


Similar News