Breaking: పవన్‌తో దిల్‌రాజు భేటీ.. ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్‌కు రావాలని ఆహ్వానం

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో నిర్మాత దిల్‌రాజు మంగళగిరి జనసేన కార్యాలయంలో భేటీ అయ్యారు...

Update: 2024-12-30 06:31 GMT

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Ap Deputy Cm Pawan Kalyan)తో నిర్మాత దిల్‌రాజు(Producer Dil Raju) మంగళగిరి జనసేన కార్యాలయం(Mangalagiri Janasena office)లో భేటీ అయ్యారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global star Ram Charan) నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్‌’(Game Changer) సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రావాలని ఆహ్వానించారు. విజయవాడ(Vijayawada)లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని పవన్‌కు దిల్ రాజు వివరించారు. అలాగే సినిమా టికెట్ రేట్ల అంశంతో పాటు సినీ పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపైనా చర్చించారు.

అలాగే పుష్ప-2 సినిమా(Pushpa-2 Movie) రిలీజ్ నేపథ్యంలో సంథ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపైనా పవన్‌కు దిల్ రాజు వివరించినట్లు తెలుస్తోంది. ఇదే విషయంలో టికెట్ల రేటు పెంపు, తెలంగాణ ప్రభుత్వం అనుమతి, బెనిఫెట్ షోల రద్దుకు సంబంధించిన అంశాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భేటీ కొనసాగుతోంది. ముగిసిన తర్వాత ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు మీడియాకు దిల్ రాజు వివరిస్తారేమోనని జనసేన పార్టీ వర్గాలు అంటున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News