Ap News: ఒంగోలులో ఈవీఎంల రీవెరిఫికేషన్ షురూ
ఒంగోలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనుమానాలను ఎన్నికల సంఘం నివృత్తి చేస్తోంది. ..
దిశ, డైనమిక్ బ్యూరో: ఒంగోలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనుమానాలను ఎన్నికల సంఘం నివృత్తి చేస్తోంది. గత ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గంలో 12 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన పోలింగ్ సరళిపై తనకు అనుమానాల ఉన్నాయంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈవీఎంల రీవెరిఫికేషన్ కోసం ఆయన రూ.5 లక్షల 44వేలు చెల్లించారు. ఈ క్రమంలో సోమవారం భాగ్యనగర్‌లోని ఈవీఎం కేంద్రం వద్ద రీవెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మే 13 నాటి ఎన్నికల్లో వినియోగించిన 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహించడంతో పాటు రీ చెకింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో కలెక్టర్ తమీమ్ అన్సారియా, ప్రత్యేక అధికారి ఝూన్సీలక్ష్మి పాల్గొన్నారు.
ఆరు రోజుల పాటు రోజుకు మూడు ఈవీఎంల చొప్పున పరిశీలించనున్నారు. బెల్ కంపెనీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అయితే ఫిర్యాదిదారు అయిన బాలినేని హాజరు కాలేదు. ఆయన తరఫున ప్రతినిధి హాజరయ్యారు. కాగా సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఈవీఎం ఓట్లు, వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చాలని బాలినేని హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరగనుంది. కౌంటింగ్ ప్రదేశం వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.
Read more...