అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. గ్రూపు-1 మెయిన్స్ వాయిదా
గ్రూపు-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు భారీగా రావడంతో వచ్చే నెల 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరగాల్సిన పరీక్షను ఏపీపీఎస్సీ(APPSC) వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
దిశ, వెబ్‌డెస్క్: గ్రూపు-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు భారీగా రావడంతో వచ్చే నెల 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరగాల్సిన పరీక్షను ఏపీపీఎస్సీ(APPSC) వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అతి త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఈ ఏడాది మార్చి 17వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 18 జిల్లాల్లో 301 పరీక్ష కేంద్రాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. ఇక ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన విడుదలయ్యాయి. ఈ గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే, వారిలో 91,463 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 81 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.