మాజీ మంత్రి పేర్ని నాని, అతని కుమారునికి షాక్.. మధ్యాహ్నం లోపు స్టేషన్ రావాలని పోలీసుల నోటీసులు
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ వ్యవహారంలో ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయింది.
దిశ, వెబ్ డెస్క్: రేషన్ బియ్యం అక్రమ రవాణా(Smuggling of ration rice)పై ఏపీ ప్రభుత్వం(AP Govt) దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ వ్యవహారంలో ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి పేర్ని నాని(former minister Nani)కి చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తండ్రీకొడుకుల ఇద్దరికీ ఆదివారం ఉదయం నోటీసులు జారీ చేశారు. అయితే ఉదయం నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు(police) పేర్ని నాని ఇంటికి వెళ్లగా.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. నోటీసుల(Notice)ను గేటు అంటించారు. ఆ నోటీసుల్లో మధ్యాహ్నం 2 గంటల లోపు స్టేషన్‌కు వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని, అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలని పోలీసులు పేర్కొన్నారు. కాగా ఈ కేసులో పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ కూడా నిందితులుగా ఉన్నారు.