AP News:వైసీపీ మాజీ మంత్రికి బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఏపీలో టీడీపీ(TDP), వైసీపీ(YCP) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Update: 2024-11-02 03:35 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ(TDP), వైసీపీ(YCP) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి(former minister Kakani Govardhan Reddy)కి బిగ్ షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా(Nellore District) వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy) పై కేసు నమోదైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) గౌరవానికి భంగం కలిగించేలా ఆయన అసత్య ఆరోపణలు చేశారని, సోషల్ మీడియా(Social Media)లో పోస్టులు పెట్టారని వెంకటాచలం మండల టీడీపీ నేతలు(TDP Leaders) పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టిన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కాకాణి పై కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్బారావు(CI Subbarao) తెలిపారు.

Tags:    

Similar News