చంద్రబాబు స్వగ్రామంలో హై టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు

ఏపీలో ఎన్నికల ఫలితాలు విడుదల నేపథ్యంలో చంద్రబాబు స్వగ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు...

Update: 2024-06-03 13:00 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మంగవారం ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు కౌంటింగ్ జరగనుంది. మంగవారం ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యాయి. భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు సమస్యాత్మక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎన్నికల పోలింగ్ సమయంలో జరిగిన అల్లర్ల దృష్యా అదనపు బలగాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో పోలీసులు భారీగా మోహరించారు. పోలీస్ పికెటింగ్ సైతం ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎలాంటి అల్లర్లు, ఘర్షణలు చోటు చేసుకోకుండా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇతరులను గ్రామంలోకి అనుమతించలేదు. వాహనాలను సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఫలితాల నేపథ్యంలో గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


Similar News