peruvian Apple cactus: దానికోసమే బ్రహ్మజముడు పండ్లు ఎంచుకున్నా..
ఆత్మకూరు పట్టణములో గౌడ్ సెంటర్ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది.
యం.రాజు సింగరాజుపల్లె గ్రామం, దిశ,ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణములో గౌడ్ సెంటర్ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే గౌడ్ సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సింగరాజపల్లె కు చెందిన యం.రాజు అనే వ్యక్తి బ్రహ్మజముడు పండ్లను ఉఫాధి గా ఎంచుకున్నాడు.
"ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెప్తూ" ఆ పండ్లను అమ్మే వ్యక్తితో దిశ ప్రతినిది మాట్లాడారు. ఈ నేపథ్యంలో రాజు ఆ పండ్ల గురించి పలు ఆసక్తికర విషయాలను దిశ ప్రతినిధికి తెలియ చేశారు.
కొన్ని సంవత్సరాలకు ముందు పొలాల గాట్లకు ఈ బ్రహ్మ జముడు చెట్లు ఉండేవని అయన అన్నారు. "మన పూర్వికులు ఈ పండ్లను ఔషధ పండ్లుగా పరిగణించేవారని తెలిపారు".
ఈ చెట్టు మొత్తం మూళ్ళ కంపతో నిండి ఉంటుందని.. కనుక చాలా జాగ్రత్తగా ఈ పండ్లను ముళ్ళులు గుచ్చుకోకుండా చెట్టునుండి తొలగించాలని పేర్కొన్నారు. చెట్టు నుండి తొలిగించిన పండ్లకు కూడా ముళ్ళు ఉంటాయని.. కనుక ఆ ముళ్ళను జాగ్రతగా తొలిగించి.. " పై తోలు తీసి ఈ పండు రుచిని చూడవచ్చని తెలిపారు."
ముఖ్యంగా ఈ పండువల్ల మనిషి ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయని స్పష్టం చేశారు. "భయంకరమైన క్యాన్సర్, కాలేయ వ్యాధుల నుండి విముక్తికి ఈ బ్రహ్మ జముడు పండ్లు చాల బాగా ఉపయోగపడతాయని తెలిపారు.
"ప్రస్తుతం ప్రజలు ఈ పండ్ల పై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. మళ్ళీ పాత అలవాట్లు, పాత పద్ధతులు పునరావృతము అవుతున్నాయి అని ప్రజల మధ్య చర్చ కొనసాగుతుంది.
ఏది ఏమైనా రాజు కష్టం వృధాకాలేదు. ప్రజలకు ఆరోగ్యం,ఆయనకు ఉపాధి దొరికింది. మొత్తానికి మార్కెట్ లో ఈ పండు ధర ఒక్కటి పది రూపాయలుగా విక్రయించడం జరుగుతుంది.