పవన్ ప్యాకేజీల బండారం బయటపెడతా: ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రెచ్చిపోయారు.
దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రెచ్చిపోయారు. జనసేనాని పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటూ ధ్వజమెత్తారు. రెమ్యునరేషన్ కోసం సినిమాల్లోనూ... ప్యాకేజీ కోసం రాజకీయాల్లోనూ పవన్ కల్యాణ్ నటిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేవారు. పవన్ కల్యాణ్ డబ్బు తీసుకోనిదే ఏ పనిచెయ్యరని అన్నారు. వైసీపీని తిట్టాలన్నా.. జైలుకెళ్లి పరామర్శించాలన్నా పవన్ కల్యాణ్ డబ్బులు తీసుకుంటారని ఆరోపించారు. అందినకాడికి పవన్ కల్యాణ్ ప్యాకేజీ తీసకుంటారని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ ప్యాకేజీ విషయాలు అన్ని మరికొన్నిరోజుల్లో బయటపెడతామని వార్నింగ్ ఇచ్చారు. హవాలా ద్వారా ఎంత డబ్బు దేశం దాటి వెళ్లింది? పవన్ ప్యాకేజీ సొమ్ము రష్యాకు వెళ్ళిందా? సింగపూర్, దుబాయ్‌లకు వెళ్లిందా? అనే విషయాలపై త్వరలోనే క్లారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర ప్రజలు ఓ రాజకీయ నాయకుడిలా భావించడం లేదన్నారు. ఓ జోకర్లా చూస్తున్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు జనసేనకు టీడీపీ వాళ్లే శత్రువులని, టీడీపీకి జనసైనికులే శత్రువులంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అధినేతలు కలిసినంతమాత్రాన కింద క్యాడర్ అంత ఈజీగా కలిసిపోరని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.