AP Deputy CM:‘తొక్కిసలాట ఘటన పై మీరు క్షమాపణ చెప్పాల్సిందే!’.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తిరుమల(Tirumala)లో బుధవారం వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట (Stampede)లో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా
దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala)లో బుధవారం వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట (Stampede)లో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నిన్న రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు కోరిన విషయం విదితమే. ఈ క్రమంలో మరోసారి తొక్కిసలాట ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు(శుక్రవారం) పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. తొక్కిసలాట ఘటనపై నేను క్షమాపణ చెప్పాను అని గుర్తు చేశారు.
ఎక్కడైనా తప్పు జరిగితే అది తమ అందరి సమిష్టి బాధ్యతని, అందుకే తిరుపతి ఘటన పై క్షమాపణలు చేప్పానని పవన్ కళ్యాణ్ తెలిపారు. క్షమాపణ చెప్పేందుకు అధికారులకు ఎందుకు నామోషీ అన్నారు. టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu), ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. తొక్కిసలాట ఘటనపై అందరూ క్షమాపణ చెప్పాల్సిందే అని వ్యాఖ్యానించారు. అధికారులు తప్పు చేయడంతో.. ప్రజలు సంక్రాంతి సంబరాలు కూడా చేసుకోలేకపోతున్నారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.