తాగేందుకు నీళ్లు అడిగితే చంపేస్తారా? ఎస్సీలను చంపీ డోర్ డెలివరీ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాగు నీళ్లు పట్టుకునేందుకు కూడా పార్టీల లెక్కల చూసే పరిస్థితి రావడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు.

Update: 2024-03-02 08:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాగు నీళ్లు పట్టుకునేందుకు కూడా పార్టీల లెక్కల చూసే పరిస్థితి రావడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మల్లవరంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బాణావత్ సాముని బాయిని ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన కలచి వేసిందన్నారు. ట్యాంకర్ దగ్గరకు తాగు నీరు పట్టుకొనేందుకు వెళ్తే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పట్టుకోరాదు అని అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

ఇంట్లో నీళ్ళు లేవని ఆమె ప్రాధేయపడ్డా వినకుండా ట్రాక్టర్‌తో ఢీ కొట్టి చంపారని, రాష్ట్రంలో ఎలాంటి దుర్మార్గపు పాలన నడుస్తుందో అందరూ అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైసీపీ వాళ్లే నీళ్లు తాగాలి.. గాలి పీల్చాలి అని జీవో ఇవ్వడం ఒక్కటే మిగిలి ఉందని విమర్శించారు. పంచ భూతాలకు పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతోంది. మల్లవరం ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా, అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మూడేళ్ల కిందట ఇదే తరహాలో పల్నాడు జిల్లాలోని నకరికల్లు ప్రాంతంలో ఎస్టీ మహిళను వైసీపీ నాయకుడు ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారని ఆరోపించారు. ఈ పాలకుడు మాట్లాడితే నా ఎస్టీలు.. ఎస్సీలు.. అంటాడని, ఎస్సీలను చంపీ డోర్ డెలివరీ చేస్తూ, ఎస్టీ మహిళలను ట్రాక్టర్‌‌తో తొక్కించేస్తూ హత్యాకాండ సాగించే వాళ్ళను వెనకేసుకొచ్చే వ్యక్తికి నా ఎస్టీ, నా ఎస్సీ అనే అర్హత ఉందా? అని ప్రశ్నించారు.

Read More..

టీడీపీ, జనసేన పొత్తుపై కుట్ర.. ముద్రగడ, జోగయ్యపై కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు  

Tags:    

Similar News