DCM:ఆ నినాదాలతో హోరెత్తించిన ఫ్యాన్స్.. పవన్ కళ్యాణ్ రియాక్షన్ వైరల్!
ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నేడు(శనివారం) కర్నూలు జిల్లా(Kurnool District)లో పర్యటిస్తున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నేడు(శనివారం) కర్నూలు జిల్లా(Kurnool District)లో పర్యటిస్తున్నారు. జిల్లాలోని పూడిచర్లలో పంట కుంట నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు. ఈ క్రమంలో ఇవాళ(మార్చి 22) ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా పూడిచర్లలో రాష్ట్రవ్యాప్తంగా 1.55 లక్షల నీటి కుంటల నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో నీటిని సంరక్షించుకోవడం చాలా ముఖ్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
సీఎం చంద్రబాబు(CM Chandrababu) నాయకత్వంలో అన్ని వ్యవస్థలు పటిష్టం చేస్తున్నామని చెప్పారు. అయితే ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా అభిమానులు ‘ఓజీ ఓజీ’ అని నినాదాలు చేశారు. దీంతో ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. పల్లెలు, రోడ్లు, దేశం బాగుండాలనేదే నా ఆలోచన.. మీరు ఓజీ ఓజీ(OG OG) అంటున్నారు. ఇక మీరు మారరంటూ పవన్ కళ్యాణ్ చిరునవ్వుతో సమాధానమిచ్చారు. ఈ క్రమంలో అభిమానుల శక్తి ముందు నా శక్తి కూడా సరిపోదని ఆయన వ్యాఖ్యానించారు.