ఆ పదవిపై పవన్ కళ్యాణ్‌కు ఇంట్రెస్ట్..ఎట్టకేలకు బయటపడ్డ సంచలన విషయం

ఏపీలో 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టించింది.

Update: 2024-06-10 10:12 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టించింది. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. రాష్ట్రంలో కూటమి 164 అసెంబ్లీ స్థానాల్లో చారిత్రాత్మక విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. అనంతరం మంత్రులకు కేటాయించే శాఖల పైన చంద్రబాబు ఫోకస్ చేయనున్నారు. ప్రమాణస్వీకారానికి ముందే దీనిపై ఓ నిర్ణయానికి రావాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో మంత్రివర్గంలోకి పవన్ వెళ్తారా.? లేక ఆ పార్టీ ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తారా.? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ భారీ మెజార్టీతో గెలిచింది. ఈ క్రమంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఇండియా టుడే వెల్లడించింది. డిప్యూటీ సీఎం పదవిని తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపింది. నిన్న మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జర్నలిస్ట్ ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కాగా పదవి విషయం పై పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. రేపు ఎన్డీయే ఎమ్మెల్యేల భేటీలో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News