Pawan Kalyan: ఐఎస్ జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం పర్యటన.. ప్రత్యేక పూజలు
ఉదయం రాజమండ్రి విమానాశ్రయానికి (Rajahmundry Airport) చేరుకున్న పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి ఐఎస్ జగన్నాథపురానికి చేరుకున్నారు. గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏలూరు జిల్లాలోని ఐఎస్ జగన్నాథపురంలో పర్యటించారు. ఉదయం రాజమండ్రి విమానాశ్రయానికి (Rajahmundry Airport) చేరుకున్న పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి ఐఎస్ జగన్నాథపురానికి చేరుకున్నారు. గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ యాగశాలలో నిర్వహించిన ధన్వంతరి హోమంలో (Dhanwantari Homam) పాల్గొన్నారు. అక్కడి నుంచి గ్రామంలో ఏర్పాటు చేసిన సభకు బయల్దేరారు. అక్కడ లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెన్షన్లను పంపిణీ చేసి.. ముఖాముఖిలో వారితో మాట్లాడనున్నారు.