ఆ విషయాలపై అసలు మాట్లాడొద్దు.. పార్టీ అధికార ప్రతినిధులకు పవన్ కీలక సూచన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పార్టీ అధికార ప్రతినిధులతో

Update: 2023-10-21 14:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పార్టీ అధికార ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో టీవీ చర్చలు, సోషల్ మీడియా, మీడియా సమావేశాల్లో ఎలా మాట్లాడాలనే విషయంపై దిశానిర్దేశం చేశారు. టీవీలో ఏయే విషయాలు మాట్లాడాలి? ఎలా మెలగాలి? అనే అంశాలపై పలు సూచనలు చేశారు. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లవద్దని, దూషణలు చేయవద్దని తెలిపారు. బాడీ షేమింగ్ చేయడం లాంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. పార్టీ కోసమే మాట్లాడాలని, ఇతర విషయాల జోలికి వెళ్లవద్దన్నారు.

తన కుటుంబసభ్యులు, సినిమాలపై వచ్చే విమర్శలకు స్పందించవద్దని, ప్రభుత్వ విధానాలు, పాలసీలపై మాట్లాడాలని అధికార ప్రతినిధులకు పవన్ సూచించారు. అలాగే మతాలు, కులాలను కించపర్చేలా మాట్లాడవద్దని, సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నిర్ధారించుకున్న తర్వాతే మాట్లాడాలని తెలిపారు. టీవీలో చర్చలకు వెళ్లేటప్పుడు సబ్జెక్ట్‌పై అవగాహన కలిగి ఉండాలని, అంతా తెలుసుకోవాలని తెలిపారు. టీవీలో జరిగే చర్చలను ఫ్యామిలీ అందరూ కూర్చోని చూస్తారని, హుందాతనంగా వ్యవహరించాలని పవన్ తెలిపారు.

Tags:    

Similar News