పులస క్రేజ్ మామూలుగా లేదుగా.. కేజీన్నర చేపకు రికార్డు స్థాయి వేలం పాట

పుస్తెలు అమ్మైన పులస కూర తినాలని సామెత చాలా మందికి తెలిసే ఉంటుంది.

Update: 2024-07-13 03:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: పుస్తెలు అమ్మైన పులస కూర తినాలని సామెత చాలా మందికి తెలిసే ఉంటుంది. పులసకు అంత డిమాండ్ ఉంటుంది మరి. ఎంతో టేస్టీగా ఉండే పులస కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరుకుంది. ఈ చేప ఎక్కువగా గోదావరిలో దొరుకుతుంది. ఒకవేళ పులస చేప సముద్రంలో దొరికితే దాన్ని ‘వలస’ చేప అని.. హుగ్లీ నదిలో దొరికితే ‘హిల్సా’ అని పిలుస్తారు. కొన్నేళ్ల క్రితం ఇక్కడి జనం రాజధానిలో ఎవరినైనా ప్రత్యేకమైన వ్యక్తుల్ని కలవటానికి వెళ్లేటప్పుడు ఈ పులస చేప పులుసును పట్టుకుని వెళ్ళేవారట. ఈ పులస చేప పులుసు ఉభయ గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ అయిన వంటకం. అయితే తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అప్పన రాముని లంకకు చెందిన ఓ మత్స్యకారుడి వలకు ఎర్ర నీళ్ల గోదావరిలో ఎదురెక్కిన కేజిన్నర పులస చేప పడింది. ఈ కేజిన్నర పులసకు వేలం పెట్టగా అనేక మంది పోటీ పడ్డారు. పోటాపోటీగా జరిగిన ఈ వేలంలో అప్పన రాముని లంకకి చెందిన మాజీ సర్పంచ్ బర్రె శ్రీను 24,000 కొనుగోలు చేశాడు.

Tags:    

Similar News