Eluru Mangamma Temple: వరద నుంచి 65 మంది భక్తుల సేఫ్

ఏలూరు జిల్లాలోని మంగమ్మ ఆలయం వద్ద వాగు వరదలో చిక్కుకున్న భక్తులను అధికారులు రక్షించారు...

Update: 2024-07-19 13:37 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. జంగారెడ్డిగూడెం మంగమ్మ ఆలయం సమీపంలో ఉన్న వాగు ఒక్కసారిగా పోటెత్తింది. దీంతో ఆలయం సందర్శనకు వెళ్లిన దేవరగుంట గ్రామానికి చెందిన 65 మంది భక్తులు వాగు అవతల చిక్కుకుపోయారు.  ఉధృతిగా వాగు ప్రవహిస్తుండటంతో రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు అక్కడే ఉండిపోయారు. ఈ విషయం మంత్రి పార్థసారథికి తెలియడంతో భక్తులకు సురక్షితంగా ఒడ్డుకు చేర్చాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం మంగమ్మ ఆలయం వద్ద సహాయ చర్యలు చేపట్టారు. తాళ్ల సాయంతో భక్తులను వాగు నుంచి ఒడ్డుకు చేర్చారు. అనంతరం స్వగ్రామానికి తరలించారు. దీంతో వరదలో చిక్కుకున్న భక్తుల కథ సుఖాంతం కావడంతో అధికార యంత్రాంగం ఊపిరి‌పీల్చుకుంది. 

Tags:    

Similar News