ఘాట్ రోడ్డులో బండరాళ్లను తొలగించిన అధికారులు

యడ్లపాడు మండలం కొండవీడు ఘాట్ రోడ్డు వెంబడి కొండచరియలు విరిగిపడిన ప్రదేశాన్ని పల్నాడు జిల్లా అటవీశాఖ అధికారి ఎన్.రామచంద్రరావు శుక్రవారం పరిశీలించారు.

Update: 2024-09-13 13:32 GMT

దిశ ప్రతినిధి,నరసరావుపేట:యడ్లపాడు మండలం కొండవీడు ఘాట్ రోడ్డు వెంబడి కొండచరియలు విరిగిపడిన ప్రదేశాన్ని పల్నాడు జిల్లా అటవీశాఖ అధికారి ఎన్.రామచంద్రరావు శుక్రవారం పరిశీలించారు. కొండవీడు ఘాట్‌ రోడ్డు వెంబడి కొండచరియలు విరిగిపడిన వాటిని ఆర్‌ అండ్‌ బీ శాఖ సమన్వయంతో అటవీశాఖ తొలగిస్తున్నట్లు డీఎఫ్‌వో తెలిపారు. రేపటికి పనులు పూర్తి అవుతాయన్నారు. కొండవీడు నగరవనం సందర్శకులను అనుమతించడం పై నిర్ణయం తీసుకోవడానికి అటవీ ఆర్ అండ్ బి అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. క్షేత్ర పరిశీలనలో రాజు, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, కొండవీడు, శ్రీ వెంకటేశ్వరరావు, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ కొండవీడు, కొండవీడు నగరవనం సిబ్బంది పాల్గొన్నారు.


Similar News