Chandrababu Naidu : గీత దాటితే వేటే.. సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

గీత దాటితే వేటు తప్పదని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు...

Update: 2024-10-26 10:01 GMT

దిశ, వెబ్ డెస్క్: గీత దాటితే వేటు తప్పదని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మద్యం(Liquor), ఇసుక విధానం(sand method)లో జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో ఆయన సీరియస్ అయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని సూచించారు. ఇసుక దందా చేసే వారిపై ప్రజలు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. మద్యం, ఇసుక విషయంలో రాజీపడేది లేదని చెప్పారు. మద్యం ఎమ్మార్పీ కంటే ఎక్కువగా అమ్మితే కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు.

ఒక్క రూపాయి కూడా అవినీతి జరగడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు. రూ. 99కే మద్యం ఇస్తామని ఎన్నికల సమయంలోనే చెప్పామని ఆయన గుర్తుచేశారు. జేబులు గుల్లకాకూడని, కుటుంబాలు నాశనం కాకూడదనే ఉద్దేశంతో తక్కువ ధరకే మద్యం అమ్మకాలు చేస్తున్నామని తెలిపారు. కొంతమంది విమర్శించారని, అది తప్పుకాదని తెలిపారు. తనకు తాగుడు అలవాటు లేదని, ఎవరూ తాగకూడదని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఇక ఎన్నికలను ఉద్దేశించి కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మే జరిగింది ఎన్నికలు కాదని, రాక్షసుడితో యుద్ధమన్నారు. ఐదేళ్లు పడిన కష్టాలు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నామని తెలిపారు. మళ్లీ మళ్లీ చెబుతున్నా 1995 సీబీఎన్ తానని, కానీ 2014లో మాత్రం కాదన్నారు. కక్షలు పెట్టుకోనని, కానీ తప్పులు చేస్తే వదిలిపెట్టనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

Tags:    

Similar News