‘నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు’.. వైసీపీ ఎంపీ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు!
ఏపీలో వైఎస్ షర్మిల నిన్న(శుక్రవారం) మూడు పేజీల బహిరంగ లేఖ రాసిన విషయం తేలిసిందే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో షర్మిల రాసిన లేఖ సంచలనంగా మారింది.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో వైఎస్ షర్మిల నిన్న(శుక్రవారం) మూడు పేజీల బహిరంగ లేఖ రాసిన విషయం తేలిసిందే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో షర్మిల రాసిన లేఖ సంచలనంగా మారింది. ఈ లేఖపై స్పందించిన పలువురు నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై నేడు(శనివారం) వైఎస్ షర్మిల స్పందించారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. సుబ్బారెడ్డి గారు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? సుబ్బారెడ్డి జగన్ మోచేతి నీళ్ళు తాగేవాడు. జగన్ పదవులు ఇస్తే అనుభవిస్తున్నారని మండిపడ్డారు. ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారు? రేపు సాయి రెడ్డి గారు కూడా మాట్లాడుతారని విమర్శించారు. వైఎస్ఆర్ బిడ్డ తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తుంది. ‘వైఎస్ఆర్ ఉన్నప్పుడు భారతి, సాక్షి సిమెంట్స్‌లో నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉండాలన్నారు.
వైవీ సుబ్బారెడ్డి తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పాలి లేదా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణం చేసి చెప్పాలి. సుబ్బారెడ్డి అంటున్నాడు. సాక్షికి, భారతి సిమెంట్స్‌కి వాళ్ల పేర్లు పెట్టుకున్నారట అందుకే ఆ ఆస్తులు వాళ్లవే నట అందులో నాకు హక్కు లేదట జగన్ సొంతంగా సంపాదించాడట ఆ రోజు వాళ్ళ పేర్లు పెట్టుకుంటే నేను అభ్యంతరం చెప్పలేదు. పేర్లతో ఏముంది అనుకున్నాను. అన్న ముచ్చట పడ్డాడు అనుకున్నాను. వాళ్ళ పేర్లతో ఆస్తులు ఉంటే, నిజంగా వాళ్లవి అవుతాయా ? నా పేరు మీద ఆస్తులు రాసి ఉంటే నేను ఎందుకు జైలుకి వెళ్ళలేదు అంటున్నారు. ఏ అన్న అయినా.. చెల్లెలు గిఫ్ట్ అంటే.. ఏ బంగారమో.. చీరనో గిఫ్ట్ ఇస్తారు. అంతేకాని ఆస్తుల్లో 40 శాతం వాట ఇస్తారా ? ఇవ్వాలని అనుకున్నది గిఫ్ట్ కాదు. నా హక్కు నా హక్కు కాబట్టే నాకు ఇస్తామని అన్నారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.