మరి కాసేపట్లో ప్రచారం స్టార్ట్.. పవన్ కల్యాణ్‌కు బిగ్ షాక్ ఇచ్చిన అధికారులు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ్టి (శనివారం) నుండి సార్వత్రిక ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తోన్న
దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ్టి (శనివారం) నుండి సార్వత్రిక ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తోన్న పిఠాపురం నుండి పవన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. జనసేనాని ప్రచార కార్యక్రమానికి జనసేన నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. మరి కొన్ని నిమిషాల్లో జనసేనాని ప్రచారం షూరు చేయనున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌కు అధికారులు బిగ్ షాకిచ్చారు. పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారరథం ‘వారాహి’ వాహనానికి పిఠాపురంలో అధికారులు అనుమతి నిరాకరించారు. వారాహి వాహనంపై నిల్చుని పవన్ ప్రసంగించకూడదంటూ అధికారులు తేల్చి చెప్పారు. నిర్ణీత సమయంలో వారాహి వాహనంపై రోడ్ షోకు దరఖాస్తు చేసుకోనందు వల్లే అనుమతి నిరాకరించినట్లు స్పష్టం చేశారు. ప్రచారంలో చిన్నపాటి వాహనానికే పర్మిషన్ ఇస్తామని తేల్చి చెప్పారు.
వారాహి వాహనానికి అధికారులు అనుమతి నిరాకరించడంతో పవన్ రోడ్ షో లేకుండానే నేరుగా హోటల్ నుండి చేబ్రోలులో జనసేన ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్లనున్నారు. వారాహికి అధికారుల అనుమతి నిరాకరణతో పవన్ ఐసర్ వాహనంపై ప్రసంగించనున్నట్లు సమాచారం. అధికారుల తీరుపై జనసేన శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు పర్మిషన్ ఉంటుంది కానీ.. పవన్ వారాహికి మాత్రమ అనుమతి ఇవ్వారా అని అధికారులపై ఫైర్ అవుతున్నారు.
Read More..