నో పర్మిషన్: చంద్రబాబుకు ఇద్దరు డీఎస్పీలను ఎస్కార్ట్ ఉంచాలన్న ప్రభుత్వవాదనను కొట్టేసిన హైకోర్టు

స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట లభించిన సంగతి తెలిసిందే.

Update: 2023-10-31 06:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట లభించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నాలుగు వారాలపాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తర్వాత ప్రభుత్వం తరఫు న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో ఇద్దరు డీఎస్పీలను ఎస్కార్ట్‌ ఉంచాలని అభ్యర్థించింది. దీనిపై ఏపీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అభ్యర్ధనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. Z+ సెక్యూరిటీ విషయంలో... కేంద్ర నిబంధనలమేరకు అమలు చేయాలని... చంద్రబాబునాయుడు సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ దక్కింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు అయ్యింది. నాలుగు వారాలపాటు చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. చంద్రబాబు నాయుడు ఆరోగ్య సమస్యలను ఆయన తరఫు న్యాయవాదులు ప్రత్యేకంగా కోర్టులో ప్రస్తావించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం చంద్రబాబు ఆరోగ్య సమస్య లు దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు చంద్రబాబు నాయుడుకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. నాలుగు వారాలు పాటు మధ్యంతర బెల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను నవంబర్ 28కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.

Read More: యుద్ధం ఇప్పుడే ప్రారంభం అయ్యింది: చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై నారా లోకేశ్

Tags:    

Similar News