ఏపీ సీఈఓగా రిలీవ్ అయిన ముఖేష్ కుమార్ మీనాకు కీలక బాధ్యతలు
ఏపీ సీఈఓగా రిలీవ్ అయిన ముఖేష్ కుమార్ మీనాకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ..
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఈఓగా రిలీవ్ అయిన ముఖేష్ కుమార్ మీనాకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పూర్తి అదనపు బాధ్యతలతో పాటు మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఏపీ ఎన్నికలు మీనా కుమార్ నేతృత్వంలోనే జరిగాయి. ఎన్నికల్లో అక్రమాలపై ఆయన ఉక్కుపాదం మోపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి నేతలపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ముఖేష్ కుమార్ స్థానంలో వివేక్ యాదవ్‌ను నియమించింది. మొన్నటి వరకూ ఆయన సీఆర్డీఏ కమిషనర్‌గా పని చేశారు. అయితే ఆయన్ను రెండు రోజుల క్రితం యువజన సర్వీసులు, క్రీడల శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఈ లోపే రాష్ట్ర ఎన్నికల అధికారిగా వివేక్ యాదవ్ నియమితులయ్యారు.