బిగ్ న్యూస్: త్వరలోనే టీడీపీలోకి NTR రీ ఎంట్రీ.. ఆసక్తి రేపుతోన్న హీరో నారా రోహిత్ కామెంట్స్

తెలుగుదేశం పార్టీ రోజు రోజుకు పుంజుకుంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాలే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

Update: 2023-03-25 08:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ రోజు రోజుకు పుంజుకుంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాలే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ ఫీవర్ మాత్రం తగ్గడం లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు గంటాపథంగా చెప్తున్నారు. అవసరమైతే సింగిల్‌గా అయినా పోటీ చేసి స్వీప్ చేస్తానని ప్రకటించేస్తున్నారు. కానీ అంత సీన్‌ లేదని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర నేతలు విమర్శలు చేస్తున్నారు. ఏవో నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపొందితే ఇక అధికారంలోకి వచ్చేస్తామనుకోవడం భ్రమేనని సెటైర్లు వేస్తున్నారు. ఆ నాలు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆప్షన్ ఉంటుందని కానీ సాధారణ ఎన్నికల్లో ఓన్లీ వన్ ఆప్షన్ దటీజ్ జగన్ అని వైసీపీ చెప్తోంది.

ఈ వ్యాఖ్యలపై అసలు సిసలైన టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న టీడీపీ పుంజుకుందని అయితే ఇందుకు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో క్రియాశీలకంగా మారితే ఇక విజయం పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే చంద్రబాబు దగ్గర నుంచి లోకేశ్, హీరో నారా రోహిత్ ఇలా ఎవరు ముఖ్యనేతలు వెళ్లినా అభిమానులు, పార్టీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై పదేపదే అడుగుతున్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికల ప్రచారం నాటికి పార్టీ కార్యక్రమాల్లో ఇన్‌వాల్వ్ చేసేలా ఓ వర్గం కార్యచరణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ..

తెలుగుదేశం పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది. అటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లోనూ గెలుపొందడం అనంతరం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం సాధించడం పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. దీంతో గట్టిగా శ్రమిస్తే టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అటు నారా లోకేశ్‌లు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు కలిసి వచ్చే ప్రతీ అంశాన్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా టీడీపీలో నందమూరి కుటుంబాన్ని భాగస్వామ్యం చేయాలని ఇకపై వారిని ముందుండి నడిపించాలని నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగా నందమూరి ఫ్యామిలీ నుంచి యువకులను పార్టీలో భాగస్వామ్యం చేసేలా కార్యచరణ రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీకి పునర్వైభవం రావాలంటే కేవలం జూనియర్ ఎన్టీఆర్ వల్లే సాధ్యం అని అటు టీడీపీలోని ఓ వర్గంతోపాటు ఇటు వైసీపీలోని కొందరు నేతలు సూచిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఏకంగా చంద్రబాబుకు, లోకేశ్‌కు తారక్ అభిమానుల నుంచి నిరసన సెగ తగిలిన సంగతి తెలిసిందే. అయితే తారక్ రాకను తాను స్వాగతిస్తున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇటీవలే ప్రకటించారు. దీంతో తారక్ ఎప్పుడు పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తారనే దానిపై అటు అభిమానులతోపాటు ఇటు రాజకీయ వర్గా్ల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతుంది.

జూ.ఎన్టీఆర్ వస్తారు : నారా రోహిత్

తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ రోల్‌పై పార్టీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో హీరో నారా రోహిత్ చేసిన వ్యాఖ్యలు నందమూరి అభిమానుల్లో ఉత్సాహం నింపింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఒనుకువారిపల్లి విడిది కేంద్రం వద్ద శనివారం ఉదయం నారా లోకేశ్‌ను రోహిత్ కలిశారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు హీరో రోహిత్ తన సంఘీభావం ప్రకటించారు. పార్టీ కార్యకర్తలు, నేతలతో కలిసి అన్న లోకేశ్‌తో సెల్ఫీ దిగారు. అనంతరం పాదయాత్ర ప్రారంభంకావడంతో అన్న అడుగులో అడుగు వేశారు.

అనంతరం నారా రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ డెఫెన్స్‌లో పడిందని చెప్పుకొచ్చారు. వరుస పరాభవాలతో ఏం చేయాలో తెలియక పుంజుకుంటున్న టీడీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని రోహిత్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై అభిమానులు ప్రశ్నించారు. తారక్ పొలిటికల్ ఎంట్రీపై రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తారక్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని చెప్పుకొచ్చారు. పార్టీకి అవసరమైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యపాత్ర పోషిస్తారని తెలిపారు. తారక్ సేవలను పార్టీ ఖచ్చితంగా వినియోగించుకుంటుందని అందుకు సమయం సందర్భం రావాలని నారా రోహిత్ వెల్లడించారు.

జూ.ఎన్టీఆర్ ఎంట్రీని స్వాగతిస్తున్నా: లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి స్వాగతించారు. రెడ్ కార్పెట్ వేస్తున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యువతతో జరిగిన ముఖాముఖిలో తారక్ పొలిటికల్ ఎంట్రీపై యువత ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు లోకేశ్ సమాధానం ఇచ్చారు. సమాజం బాగుండాలని కోరుకునే జూనియర్ ఎన్టీఆర్, యువకులు రాజకీయాల్లోకి వస్తే మరింత బాగుంటుందని నారా లోకేశ్ ఆకాంక్షించిన సంగతి తెలిసిందే. మరోవైపు నందమూరి ఫ్యామిలీ నుంచి సుహాసిని, రామకృష్ణ, చైతన్యకృష్ణలు సైతం త్వరలోనే పార్టీలో కీ రోల్ పోషిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే రాజకీయంగా అన్ని అంశాలపై అవగాహన తెచ్చుకున్న ఈ ముగ్గురు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది.

Tags:    

Similar News