Breaking: నేడు ఏసీబీ కోర్టుకి నారా లోకేష్.. కారణం ఇదే

నారా లోకేష్ గతంలో యువగలం పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలో పర్యటించిన విషయం అందరికి తెలిసిందే.

Update: 2024-02-21 05:58 GMT

దిశ డైనమిక్ బ్యూరో:  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గతంలో యువగలం పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలో పర్యటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్ట్ తో నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు బ్రేక్ పడింది. అయితే తాను పాదయాత్ర చెయ్యని నియోజకవర్గాల్లో శంఖారావం పేరుతో  నారాలోకేష్ పర్యటిస్తున్న విషయం అందరికి సుపరిచితమే.

ఇక నారాలోకేష్ పాల్గొన్న ప్రతి బహిరంగ సభలో ఓ రెడ్ బుక్ చూపించి అందులో తప్పు చేసిన వాళ్ళ పేర్లు ఉన్నాయని.. టీడీపీ అధికారంలోకి రాగానే బుక్ లోకి ఎక్కిన అందరిపై తగిన చర్యలు తీసుకుంటాను అని చెప్తున్నారు. దీనితో నారా లోకేష్ 41ఏ నిబంధలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరిస్తూ.. రెడ్ బుక్ లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూన్నారని నారా లోకేష్ పై ఏసీబీ కోర్టు సీఐడీ పిటిషన్ వేసింది.

కాగా ఆ పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. ఇక నారా లోకేష్ పైన పీటీషన్ వేసిన తరువాత కూడా ఇటీవల జరిగిన శంఖారావం భహిరంగ సభలో రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ.. ఈ రెడ్ బుక్ ని చూస్తే వైసీపీ వణికి పోతోందని.. అందుకే తనని అరెస్ట్ చెయ్యమి పోలీసులను కోరుతుందని పేర్కొన్నారు. తప్పు చేస్తే భయపడాలి.. తప్పు చెయ్యనప్పుడు ఈ బుక్ ని చూసి బయడడం ఎందుకని ప్రశ్నించారు. నేను ఇక్కడే ఉన్న వచ్చి అరెస్ట్ చేసుకోండి అని సవాల్ విసిరారు. 

Tags:    

Similar News