ఉండవల్లి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో Nara Lokesh
మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు.
దిశ, మంగళగిరి : మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు. తొలుత కాలనీలలో తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలపై కరపత్రాలని పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఆర్కేని రెండు సార్లు గెలిపిస్తే అభివృద్దిని గాలికోదిలారు. అవినీతి చెయ్యడంలోనూ, నటినలోనూ బిజీగా ఉన్నారు. గెలిచిన వెంటనే ఇళ్ళ పట్టాలు ఇస్తానన్న ఎమ్మెల్యే ఆర్కే వందల సంఖ్యలో పేద ప్రజల ఇళ్లు కూల్చారు.
40 ఏళ్లుగా ఇరిగేషన్, అటవీ భూముల్లో నివసిస్తున్న వారికి నేను గెలిచిన ఏడాదిలో బట్టలు పెట్టి ఇళ్ళ పట్టాలు ఇస్తానని తెలిపారు. అంతే కాకుండా దేవుడి మాన్యం ప్రాంతంలో 48 గంటల్లోనే రోడ్డు వేయించి జంగిల్ క్లియరెన్స్ చేయిస్తానన్నారు. గతంలో స్థలం కేటాయించినా మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయాం. ఎండోమెంట్ భూముల్లో నివసిస్తున్న వారికి పట్టాలు ఇస్తాను. మౌలిక సదుపాయాలు అన్ని పక్కాగా ఏర్పాటు చేసే బాధ్యత నాది. ఉండవల్లి కొండపై గ్రావెల్ దోపిడి జరుగుతుంది. అనుమతి గోరంత దోచింది కొండంతని మండిపడ్డారు. నేను గెలిచిన తర్వాత పేదలకు మంగళగిరి నియోజకవర్గంలో 10 వేల ఇళ్లు నిర్మిస్తానని తెలిపారు.