‘ఇక్కడ ఉన్నది రోజా కాదు...భాను’ అంటూ అధికారులపై నగరి ఎమ్మెల్యే ఫైర్

‘ఇక్కడ ఉన్నది రోజా కాదు...భాను’ అంటూ అధికారులపై నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఫైర్ అయ్యారు. ...

Update: 2024-06-27 15:42 GMT

దిశ, వెబ్ డెస్క్: ‘ఇక్కడ ఉన్నది రోజా కాదు...భాను’ అంటూ అధికారులపై నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఫైర్ అయ్యారు. పుత్తూరు మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం మారిందని, అలవాట్లు కూడా మారాలని నిజాయితీగా, బాధ్యతగా పని చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల సంక్షేమం, అభివృద్దే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని, శాంతి భద్రతలు కాపాడాలని, ప్రజలు ప్రశాంతంగా జీవించాలన్నారు. అధికారులు తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంచికి మంచి, చెడుకు చెడు, నాటకాలు ఆడితే సహించేది లేదన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహారించాలని తెలిపారు.గంజాయి, సారాయి, ఇసుక, మట్టి అక్రమ రవాణా చేసేవారిని వదలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం వేల కేసులు బయటపడ్డాయని, అన్నింటిపై విచారణ చేయిస్తామన్నారు. ప్రభుత్వ భూముల కబ్జాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం పెద్దపీట వేస్తామని, జూలై 1 నాటికి అవ్వతాతలకు రూ.7 వేలు పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ పేర్కొన్నారు.

Similar News