TTD చైర్మన్‌గా నాగబాబు అని ప్రచారం.. స్పందించిన మెగా బ్రదర్

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Update: 2024-06-06 13:09 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో విజయ దుందుభి మోగించారు. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు. ఈ క్రమంలో గెలుపు అనంతరం జనసేనాని టీటీడీ పై ఫోకస్ చేస్తున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌గా జనసేన నేత నాగబాబును నియమించారని వార్తలు షికార్లు చేస్తున్నాయి. జనసేన పార్టీకి వెన్నంటి నడుస్తున్న తన అన్నకి టీటీడీ చైర్మన్ పదవి దక్కనున్నట్లు వినిపిస్తున్న వార్తల పై తాజాగా నాగబాబు స్పందించారు. ఈ ప్రచారాన్ని నాగబాబు ఖండించారు. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని నాగబాబు స్పష్టం చేశారు.

Similar News