విశాఖ స్టీల్ ప్లాంట్‌పై బీజేపీ డ్రామా: కేఏ పాల్

స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ ఎంపీలు ఢిల్లీలో బుధవారం ఆడిన డ్రామా ప్రజలు గమనించారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ పేర్కొన్నారు......

Update: 2024-06-27 14:34 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ ఎంపీలు ఢిల్లీలో బుధవారం ఆడిన డ్రామా ప్రజలు గమనించారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ పేర్కొన్నారు. ఆయన గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి వినతి పత్రం అందజేయడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుండగా, ఆ పార్టీ ఎంపీలు ప్రధాని బదులుగా ఉక్కు శాఖ మంత్రిని కలవడం ఏంటని పాల్ ప్రశ్నించారు. గంగవరం పోర్టును కూడా గతంలో అదానికి కారుచౌకగా అమ్మేశారని ఆయన గుర్తు చేశారు. ప్రధాని మోడీ కోర్టు ఆదేశాలు పాటించాలని, ప్లాంట్ అమ్మకుండా స్టేటస్ కో ఇచ్చిందని, ఉత్తర్వులు ఇప్పుడే తనకు అందాయని తెలిపారు.

సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, ఎంపీ భరత్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కేఏ పాల్ ప్రశ్నించారు. ఏప్రిల్ 25న స్టీల్ ప్లాంట్ ఆస్తులు అమ్మకూడదంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. ప్రజలు ఎన్నుకున్న కూటమి ప్రభుత్వం వచ్చినా సరే స్టీల్ ప్లాంట్‌కి రక్షణ లేకుండా పోయిందని, స్టీల్ ప్లాంట్ కాపాడేందుకు వంద రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ 30 వేల మంది మహిళలు మిస్సింగ్ మీద ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని కేఏ పాల్ ప్రశ్నించారు...

Similar News