Vizianagaram: వ్యాపారికి మూత్రం తాగించి దాడి... వ్యక్తి అరెస్ట్

విజయనగరం జిల్లాలో రౌడీలు రెచ్చిపోయారు. ..

Update: 2024-06-27 16:54 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లాలో రౌడీలు రెచ్చిపోయారు. రాజస్థాన్‌ వ్యాపారి భగవాన్ రామ్‌ను కిడ్నాప్ చేసి దాడి చేశారు. అంతేకాదు ఆయనతో మూత్రం తాగించారు. దీంతో పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.

కాగా వ్యాపారులు భగవాన్‌రామ్, బిజిలారామ్ ఇద్దరు రాజస్థానీయులే. భగవాన్ రామ్ కొన్నేళ్ల క్రితం విజయనగరం జిల్లాకు వచ్చి వ్యాపారం చేస్తున్నారు. అయితే బిజిలారామ్‌ రాజస్థాన్ నుంచి వచ్చి భగవాన్ రామ్‌ను కలిశారు. మద్యం తాగుదామని చెప్పి కారులో తీసుకెళ్లారు. విశాఖ సమీపంలో వెళ్లగానే కారులో భగవాన్ రామ్‌పై బిజిలారామ్‌తో పాటు అతనితో వచ్చిన రౌడీలు దాడి చేశారు. అనంతరం రాజస్థాన్ వెళ్లిపోయారు. అయితే భగవాన్ రామ్ పై దాడి చేసిన వీడియో వైరల్ అయింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అసలు నిందుతుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు

Similar News