Nadendla Manohar: తనిఖీల విషయంలో వెనక్కి తగ్గేది లేదు: మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు
చెక్‌పోస్టుల ఏర్పాటు, తనిఖీల విషయంలో ఏ మాత్రం తగ్గేదేలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: చెక్‌పోస్టుల ఏర్పాటు, తనిఖీల విషయంలో ఏ మాత్రం తగ్గేదేలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన కాకినాడ యాంకరేజి పోర్టు వద్ద చెక్ పోస్టును తనిఖీ చేశారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న బియ్యం రవాణాపై ఆయన ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ మాఫియా అక్రమాలపై సీఎం చంద్రబాబుతో త్వరలోనే చర్చిస్తామని అన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే సీఐడీ, ఇతర దర్యాప్తు సంస్థలతో ఎంక్వైరీ చేయిస్తామని అన్నారు. తనిఖీలు చేస్తే.. వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతామంటూ వ్యాపారులు బెదిరిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. న్యాయంగా వ్యాపారం చేస్తే వారి జోలికి ఎవరూ వెళ్లబోరని స్వయంగా సర్కారే వారికి దన్నుగా నిలుస్తుందని అన్నారు. అక్రమార్జనతో, నిబంధనలకు తుంగలో తొక్కి వ్యాపారులను తాము వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. అదేవిధంగా కొత్తం చెక్‌పోస్టుల ఏర్పాటు, తనిఖీల విషయంలో ఏ మాత్రం తగ్గేదేలేదని అన్నారు. ఇక నుంచి యాంకరేజి చెక్‌పోస్టుల వద్ద రౌండ్ ది క్లాక్ సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు.
Read More..
AP News:న్యాయ బద్దంగా చేసే వ్యాపారాలకు సహకరిస్తాం:మంత్రి నాదెండ్ల మనోహర్