బలహీనపడిన అల్పపీడనం.. ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ వర్షసూచన
నేడు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
దిశ, వెబ్ డెస్క్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడింది. కానీ.. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు మాత్రం కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. నేడు కొన్ని ప్రాంతాల్లో, 15,16 తేదీల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
నేడు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, పల్నాడు, ఉమ్మడి కర్నూల్, ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.