కుటుంబ గొడవల ఎఫెక్ట్.. MLC దువ్వాడకు భారీ షాకిచ్చిన వైసీపీ అధిష్టానం
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు వైసీపీ అధిష్టానం భారీ షాకిచ్చింది. కుటుంబ గొడవల కారణంగా ఆయనపై వేటు వేసింది. టెక్కిలి వైసీపీ ఇన్‌చార్జిగా దువ్వాడను తొలగించి పేరాడ తిలక్‌కు బాధ్యతలు అప్పగించారు.
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు వైసీపీ అధిష్టానం భారీ షాకిచ్చింది. కుటుంబ గొడవల కారణంగా ఆయనపై వేటు వేసింది. టెక్కిలి వైసీపీ ఇన్‌చార్జిగా దువ్వాడను తొలగించి పేరాడ తిలక్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు గురువారం రాత్రి పార్టీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇంట్లో తేల్చుకోవల్సిన దువ్వాడ కుటుంబ గొడవ రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండో పెళ్లి చేసుకొని తనను రోడ్డున పడేశారని ఆయన భార్య దువ్వాడ వాణి సంచలన ఆరోపణలు చేసింది. ఇదే విషయమై ఆమె కూతుళ్లతో రోడ్డెక్కి రోజుల తరబడి నిరసన తెలిపారు. దివ్వెల మాధురి అనే మహిళతో వేరు కాపురం పెట్టాడని ఇటీవల కన్నీరు పెట్టారు. ఏ హక్కుతో మాధుని మా ఇంట్లో, నా భర్తతో ఉంటోందని ప్రశ్నించారు. ఇక ఈ వ్యాఖ్యలపై అటు మాధురి, ఇటు శ్రీనివాస్ స్పందించి మరింత రచ్చ చేశారు. చివరకు ఇది ఆయనప వేటుకు దారి తీసింది.