పార్టీ మార్పు వార్తలపై స్పందించిన అధికార పార్టీ MLA

పార్టీ మార్పు వార్తలపై కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మార్పు వార్తలు అవాస్తవం అని కొట్టిపారేశారు.

Update: 2024-02-02 06:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ మార్పు వార్తలపై కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మార్పు వార్తలు అవాస్తవం అని కొట్టిపారేశారు. తాను ఎంత కాలం రాజకీయాల్లో అంతకాలం సీఎం జగన్ వెంటే ఉంటానని తేల్చి చెప్పారు. కనిగిరిలో మళ్లీ వైసీపీ జెండానే ఎగరేస్తామని అన్నారు. ఇతర పార్టీలకు ఇక్కడ అంత సీన్ లేదని ఎద్దేవా చేశారు. అనవసరంగా తనపై కొందరు కావాలనే పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనకు జగన్ మోహన్ రెడ్డి రాజకీయ భిక్ష పెట్టారని అన్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్‌ వదిలిపెట్టి వేరే పార్టీలోకి వెళ్లబోను అని చెప్పారు. కాగా, మధుసూదన్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న నియోజకవర్గానికి అధిష్టానం కొత్త ఇన్‌చార్జిని నియమించిన విషయం తెలిసిందే. మధుసూదన్‌ను కాదని నారాయణ యాదవ్‌కు ఈ సారి బాధ్యతలు అప్పగించింది. దీంతో మధుసూదన్‌ పార్టీ మారబోతున్నారంటూ వార్తలు విస్తృతమయ్యాయి. టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నాడని తెలిసింది. ఈ వార్తలకు పుల్‌స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే స్పందిస్తున్నట్లు తెలిపారు. నారాయణ యాదవ్‌కు సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పారు. మరోసారి కనిగిరి కోటపై వైసీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News