‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది’.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అభివృద్ధే(State Development) లక్ష్యంగా ముందుకెళ్తుందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(Minister Ramprasad Reddy) తెలిపారు.

Update: 2025-01-24 12:05 GMT
‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది’.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అభివృద్ధే(State Development) లక్ష్యంగా ముందుకెళ్తుందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(Minister Ramprasad Reddy) తెలిపారు. సీఎం చంద్రబాబు(Cm Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ నేతల(TDP Leaders) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ గత ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. వైసీపీ నాయకులు(YCP Leaders) మాట్లాడుతుంటే దెయ్యాలు, వేదాలు వల్లించినట్లుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రామాపురం మండలం రాచపల్లి పంచాయతీలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను మంగళవారం అధికారులు చట్టబద్ధంగా తొలగించడం జరిగిందన్నారు. దీనిని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అక్రమ నిర్మాణాల తొలగింపు అంటూ అడ్డుకోవడం బాధాకరమన్నారు.

Tags:    

Similar News