Nara Bhuvaneswari:మహిళలతో కలిసి కోలాటం ఆడిన సీఎం చంద్రబాబు సతీమణి
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు(NTR Trust) ట్రస్టీ నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు(NTR Trust) ట్రస్టీ నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నిన్న(బుధవారం) కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలంలో నారా భువనేశ్వరికి నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో ఆమె గుడి చెంబగిరిలో మహిళల ముఖాముఖిలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషి గురించి వివరించారు. గుడిపల్లి మండల పరిధిలో ఈ వేసవి కాలంలో తాగునీటి సమస్యలు రాకుండా 11 బోర్లు సీఎం చంద్రబాబు(CM Chandrababu) వేయించారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తున్నాం. అభివృద్ధికి చేయూత అందిస్తున్నామని ఆమె తెలిపారు. నారా భువనేశ్వరి పర్యటన సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అక్కడి మహిళలతో కలిసి సరదాగా నారా భువనేశ్వరి కోలాటం ఆడారు. ఈ క్రమంలో చిన్నారుల కోలాట నృత్యాలను చూసి ఆమె ఆనందించారు.
మహిళలు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి..
ఈ రోజు(గురువారం) కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఎలీప్ ఏర్పాటు చేశారు. ఎలీప్ నా కళ్ల ముందు పుట్టి ఎదిగింది. మహిళా పారిశ్రామిక వేత్తల కోసం కుప్పంలో ఎలీప్ ఏర్పాటు కాబోతోంది. దీని ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా తయారై మరో పది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకుంటారు. స్త్రీలు శక్తిమంతులు. మగవారిని మించి పని చేయగలరు. నేను ఇది చేయలేను అనే భయం లేకుండా ముందడుగు వేయాలి. అప్పుడే అద్భుతాలు సాధించగలరు. సాధారణ గృహిణిగా ఉన్న నాకు సీఎం చంద్రబాబు హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారు.
అన్నీ స్వయంగా నేర్చుకున్నాను. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము కూడా మహిళల ఆర్థిక స్వావలంబనకు పాటుబడుతున్నాము. వారి స్వయం ఉపాధికి చేయూత అందిస్తున్నాము. ఎలీప్ ఏర్పాటు విషయం పై ఐఏఎస్ అధికారి వికాస్ గారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాను. కుప్పం పరిధిలో పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న తరహా పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. వాటిలో పని చేయడం ద్వారా మహిళలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని నారా భువనేశ్వరి అన్నారు.