పవన్ కల్యాణ్ ఫ్రస్టేషన్ పీక్స్ చేరింది.. రోజా సంచలన వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్టేషన్ పీక్స్ చేరిందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు...
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫ్రస్టేషన్ పీక్స్ చేరిందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. సీఎం జగన్, పవన్ కల్యాణ్ ఒకేసారి పార్టీలు పెట్టారని.. కానీ జనసేన బలోపేతం కాకపోవడానికి ఎవరు కారణమని ఆమె ప్రశ్నించారు. ఆవేశానికి, అరుపులకు ఓట్లు పడవని పవన్ తెలుసుకోవాలన్నారు. అలా అయితే ఆర్ నారాయణ మూర్తి ఎప్పుడో ప్రధానమంత్రి అయ్యేవారని రోజా సూచించారు. ప్రజలకు తమరు ఏం చేయబోతున్నారనేది ముందు చెప్పాలని సలహా ఇచ్చారు. అధికారం చేపట్టాలనే లక్ష్యంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఏం చేశావనేదే ప్రజలు గమనిస్తారని తెలిపారు. జగన్ పార్టీ పెట్టి 151 సీట్లు సాధించి తిరుగులేని ముఖ్యమంత్రి అయ్యారని, కానీ పవన్ కల్యాణ్ మాత్రం రెండు చోట్ల ఓడిపోయారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఓ పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి.. 24 సీట్లకే పరిమితం కావడం సిగ్గు చేటని మంత్రి రోజా విమర్శించారు. ఇప్పటి వరకూ జనసేన బూత్, మండల కమిటీల నిర్మాణ పనులు చేయలేదని వ్యాఖ్యానించారు. ముష్టిం 30 సీట్లు కూడా తెచ్చుకోలేని పవన్.. చంద్రబాబు కాళ్ల వద్ద పని చేస్తూ జనసైనికులను తాకట్టు పెడుతున్నారని మంత్రి రోజా మండిపడ్డారు.
Read More..
Breaking: ఆర్ నారాయణ మూర్తిని అవమానించిన మంత్రి రోజా.. వీడియో వైరల్