కువైట్‌లో తెలుగు మహిళకు చిత్రహింసలు..స్పందించిన మంత్రి

ఉపాధి కోసం విదేశాలకు(foreign countries) వెళ్లిన తెలుగు వాళ్లు అక్కడ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

Update: 2024-09-13 13:53 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఉపాధి కోసం విదేశాలకు(foreign countries) వెళ్లిన తెలుగు వాళ్లు అక్కడ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడి వారి బాధలను సోషల్ మీడియా(Social media) ద్వారా తెలియజేస్తున్నారు. తాజాగా ఉపాధి(Employment) కోసం కువైట్ వెళ్లిన ఏపీకి చెందిన ఓ మహిళను ఆమె యజమాని గదిలో చిత్రహింసలు(Torture) చేస్తున్నారని ఓ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లాకు చెందిన కవిత అనే మ‌హిళ‌ తనను చిత్రహింసల నుంచి రక్షించాలని కోరుతూ ఏపీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి వీడియోలో విజ్ఞప్తి చేసింది. "దయచేసి నన్ను రక్షించండి సార్..ఇక్కడ చిత్రహింసలకు గురవుతున్నాను. నాకు ఇద్దరు పిల్లలు.

వికలాంగుడైన భర్త ఉన్నారు. వారి కోసమే కువైట్‌కు వచ్చాను. కానీ ఇక్కడ నాకు అన్యాయం జరుగుతోంది" అని తెలిపింది. ఓ ఏజెంట్ ద్వారా అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత ఆమె పాస్‌పోర్టు లాక్కొవ‌డంతో పాటు తన ఫోన్‌ను బ్లాక్ చేశారని, తద్వారా కుటుంబ స‌భ్యులు, అధికారులతో తనకు ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా చేశారని ఆమె పేర్కొంది. ఆమె విజ్ఞప్తికి స్పందించిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వెంట‌నే రాష్ట్ర ఎన్నారై సాధికారత-సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు లేఖ రాశారు. కవితను సురక్షితంగా స్వ‌దేశానికి తిరిగి వచ్చేలా చేయాలని కోరారు.


Similar News