ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. మంత్రి కీలక ప్రకటన

ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది....

Update: 2024-08-04 17:01 GMT
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. మంత్రి కీలక ప్రకటన
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. త్వరలోనే మహిళలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు అడుగులు వేస్తోంది. ఈ మేరకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి కడప పర్యటనలో కీలక ప్రకటన చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. త్వరలోనే ఆ పథకాన్ని అమలు చేస్తామన్నారు. కడప ఆర్టీసీ డిపోలో 16 కొత్త బస్సులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 400 కొత్త బస్సులతో సేవలు అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, తమ ప్రభుత్వం గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. 

Tags:    

Similar News