Minister Kolusu Parthasarathy:తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పార్థసారథి

తిరుమల(Tirumala)లో నేడు(శనివారం) వేకువజామున శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి(Minister Kolusu Parthasarathy) దర్శించుకున్నారు.

Update: 2024-11-09 08:39 GMT

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala)లో నేడు(శనివారం) వేకువజామున శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి(Minister Kolusu Parthasarathy) దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా ధ్వజ స్తంభానికి మొక్కులు చెల్లించుకుని శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి పార్థసారథికి రంగనాయక మండపం వద్ద వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఈ క్రమంలో దర్శనం అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రశాంత వాతావరణంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందని, అన్ని వసతులు మెరుగుపడినట్టు తెలుస్తుందని అన్నారు. కొంతమంది భక్తులతో మాట్లాడినప్పుడు వారు దర్శనం ఏర్పాట్లు, ప్రసాదము, అన్న ప్రసాదము, వసతి తదితర ఏర్పాట్లలో టీటీడీ మరియు కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని విధాల వెనుకబడ్డ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి దేశంలోనే మన రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడానికి నిరంతరం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు గారికి ఆ దేవ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నాను అని తెలిపారు. అలాగే ప్రజలకు, అన్ని విధాలా సిరి సంపదలను ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకున్నానని మంత్రి పార్థసారథి తెలిపారు.

Tags:    

Similar News