Nimmala RamaNaidu: జగన్ పాపాలు ప్రజలను ఇంకావెంటాడుతున్నాయి: మంత్రి నిమ్మల

తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala ramanaidu) రెండో రోజు పర్యటన కొనసాగుతోంది.

Update: 2024-10-26 06:35 GMT
Nimmala RamaNaidu: జగన్ పాపాలు ప్రజలను ఇంకావెంటాడుతున్నాయి: మంత్రి నిమ్మల
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala ramanaidu) రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం మీద రూ.14 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అద్భుతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. గత ఐదేళ్ల జగన్ పాపాలు ప్రజలపై భారం రూపంలో వెంటాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లు రేట్లు దాచిపెట్టి, చీకటి జీవోలు ఇచ్చి ప్రజలపై భారం మోపిందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేశాడని, కానీ తమ నాయకుడు చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అహర్నిశలు కృషి చేయడమే కాకుండా ఇచ్చిన హామీల అమలుకు శ్రమిస్తున్నారని నిమ్మల తెలిపారు.

ఈ సందర్భంగా రాజమండ్రి (Rajamundry) శుభమస్తు కల్యాణ మండపంలో కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగునీటి సంఘాలతో పాటు కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. అలాగే ఎన్డీయే కూటమి నేతలు సమన్వయంతో ఎలా పని చేయాలనేదానిపై చర్చించారు.


Similar News