ఏ సమస్య ఉన్నా అండగా నిలబడతా: మంత్రి గొట్టిపాటి హామీ

సంక్షోభంలోను ప్రజలకు సంక్షేమం అందించాలన్నదే సీఎం చంద్రబాబు ఆలోచన అని మంత్రి గొట్టిపాటి తెలిపారు..

Update: 2025-02-01 16:57 GMT
ఏ సమస్య ఉన్నా అండగా నిలబడతా: మంత్రి గొట్టిపాటి హామీ
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: సంక్షోభంలోను ప్రజలకు సంక్షేమం అందించాలన్నదే సీఎం నారా చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ఆలోచన అని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ (Minister Gottipati Ravi Kumar) తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతి నెలా ఠంచన్‌గా ఒకటవ తేదీనే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల(NTR Bharosa Pensions) పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం, ముప్పవరం గ్రామంలో మంత్రి గొట్టిపాటి ఇంటింటికీ తిరుగుతూ లబ్దిదారులకు పింఛన్లు అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లు జగన్ మోహన్ రెడ్డి పెన్షనర్లను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. రూ.1000 పెంచేందుకు జగన్‌కు నాలుగేళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో రూ.1000 పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ప్రతి నెల 1నే వృద్ధులకు రూ. 4 వేలు, దివ్యాంగులకు రూ. 6 వేలుపూర్తి స్థాయి దివ్యాంగులకు రూ. 15 వేలు పంపిణీ చేస్తూ..దేశంలోనే అత్యధికంగా సామాజిక పెన్షన్లు అందిస్తున్న అతిపెద్ద సంక్షేమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని సగర్వంగా తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఇది పేదల ప్రభుత్వమని, పేదల జీవితాల్లో వెలుగులు నింపే మంచి మనసున్న ప్రభుత్వమని పేర్కొన్నారు. గుండ్లకమ్మ జలాశయం గేట్లను రూ. 10 కోట్లతో బాగు చేస్తున్నామన్నారు. 6 ఏళ్ల తర్వాత 20 లక్షల 65 వేల చేపపిల్లలను వదిలామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.

జె.పంగులూరు మండలం ముప్పవరం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గవ్యాప్తంగా 19 మంది దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. అంతేకాదు వారితో స్వయంగా మాట్లాడి ఏ సమస్య ఉన్నా అండగా నిలబడతామని భరోసా ఇచ్చామన్నారు. ఆ తర్వాత గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేసి, ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని వినతిపత్రాలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఆయా అర్జీలను పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశానని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే తీర్చేందుకు కూటమి ప్రభుత్వం సదా సిద్ధంగా ఉంటుందని మరోసారి తెలియజేస్తున్నానని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. 

Tags:    

Similar News