NAAC రేటింగ్ కోసమూ లంచాలు.. ఇప్పటివరకు 10 మంది అరెస్ట్

సీబీఐ(CBI) అధికారులు మరోసారి దూకుడు ప్రదర్శించారు. శనివారం దేశవ్యాప్తంగా 20చోట్ల విద్యాసంస్థల్లో సోదాలు నిర్వహించారు.

Update: 2025-02-01 16:54 GMT
NAAC రేటింగ్ కోసమూ లంచాలు.. ఇప్పటివరకు 10 మంది అరెస్ట్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: సీబీఐ(CBI) అధికారులు మరోసారి దూకుడు ప్రదర్శించారు. శనివారం దేశవ్యాప్తంగా 20చోట్ల విద్యాసంస్థల్లో సోదాలు నిర్వహించారు. NAAC రేటింగ్స్ కోసం లంచాలు ఇచ్చినట్టు ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగారు. ఇప్పటివరకు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరుకు చెందిన ఓ యూనివర్సిటీ ఉద్యోగులతో పాటు NAAC అధికారులను సీబీఐ అదుపులోకి తీసుకున్నది. చెన్నై, విజయవాడ, బెంగళూరు, భోపాల్, ఢిల్లీలో సోదాలు జరిపారు. నగదు, బంగారం, సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌ల రూపంలో లంచాలు ఇచ్చినట్టు గుర్తించారు. రూ.37లక్షలు, 6 ల్యాప్‌ట్యాప్‌లు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ మధ్య కాలంలో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగి అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు పరిగెట్టేలా సోదాలు జరుపుతున్నారు. లంచం డిమాండ్‌ చేస్తున్నారన్న బాధితుల ఫిర్యాదుల నేపథ్యంలో చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News