కేంద్ర బడ్జెట్‌‌పై ఏపీ బీజేపీ నేతల ప్రశంసలు.. గుడ్ అంటూ కితాబు

కేంద్ర బడ్జెట్‌‌పై ఏపీ బీజేపీ నేతల ప్రశంసలు కురిపించారు...

Update: 2025-02-01 16:29 GMT
కేంద్ర బడ్జెట్‌‌పై ఏపీ బీజేపీ నేతల ప్రశంసలు.. గుడ్ అంటూ కితాబు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌(Union Budget)ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(Union Minister Nirmala Sitharaman) ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు కేటాయింపులు జరిపారు. పోలవరం(Polavaram) ప్రాజెక్టుతో పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steell Plant), విశాఖ పోర్టుకు కేంద్ర బడ్జెట్లలో నిధులు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు, పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా రూ.12,157 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.162 కోట్లు, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు రూ.186 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్‌కు మద్దతుగా రూ.375 కోట్లు, రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.240 కోట్లు, రాష్ట్ర ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు రెండో దశకు రూ.242.50 కోట్లు.’’ కేటాయింపు జరిగింది. దీంతో ఈ బడ్జెట్ పై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. కూటమి నాయకులు స్వాగతిస్తుంటే మిగిలిన పార్టీలు విమర్శలు చేస్తున్నారు. ఇక బీజేపీ నేతలైతే ప్రసంశలు కురిపిస్తున్నారు.

కేంద్ర బడ్జెట్‌ భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి(AP BJP chief Purandheswari) అన్నారు. ఆర్థిక, దేశాభివృద్ధిని ప్రోత్సహించే బడ్జెట్ ఇదన్నారు. మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా ఉందని పురంధేశ్వరి పేర్కొన్నారు.

బడ్జెట్‌లో వైద్యరంగానికి పెద్ద పీటవేశారని మంత్రి సత్యకుమార్(Minister Satyakumar) అన్నారు. దేశంలో 10 వేల మెడికల్‌ సీట్లు పెంచుతున్నారన్నారు. ఐదేళ్లలో 75 వేల మెడికల్‌ సీట్లు పెంచనున్నారని తెలిపారు. బీమా రంగంలో 100శాతం FDIలను అనుమతించడంతో క్యాన్సర్ వంటి వ్యాధులకు మరిన్ని పాలసీలు వస్తాయని మంత్రి సత్యకుమార్‌ స్పష్టం చేశారు. 

Tags:    

Similar News